Home » Sonia Gandhi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీలో చేరాల్సిందిగా విపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.
సినీ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తాజాగా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు అయ్యారని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్‌సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు
లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.
లోక్‌సభ ఎన్నికలు - 2024కు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ ( Congress ) ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో విడుదల అనంతరం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనుంది.
కుల గణనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ( Congress ) నాయకుడు ఆనంద్ శర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో ఇంట్రెస్టింగ్ విషయాలు యాడ్ చేశారు.
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గేతో పాటు.. ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవ లంభిస్తోందన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై సోనియా గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ (Congress) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.