Home » Smitha Sabarval
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అంచనాల సవరణ, టెండర్ల ప్రక్రియలో తమ పాత్రేమీ లేదని ఐఏఎస్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేశామని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇవాళ( సోమవారం) దాదాపు 10మంది ఐఏఎస్‌లను విచారించింది. కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, ఎస్.కె.జోషి, కంచర్ల రఘు హాజరయ్యారు. ఇందులో పలువురు తాజా, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం పలువురు తాజా, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారించనుంది.
బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించారు. బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
Telangana Govt Transfers IAS And IPS Officials : అవును.. ఊహించిన విధంగానే తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్, ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేసింది. బుధవారం నాడు 26 మంది టాప్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే..