Home » Singanamala
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. పసుపుల ఫుడ్స్ చైర్మన పసుపుల శ్రీరామిరెడ్డి మండల కేంద్రంలోని అర్బన హెల్త్ సెంటర్‌లో గర్భిణులకు ఏర్పాటు చేసి న భోజన వసతిని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
నిత్యం వం దలాది వాహనాలు రాకపోకలు సాగించే మండలం లోని పలు రహదారులు ప్రయాణికుల పట్ల ప్రమాద కరంగా మారాయి. సైడ్‌వాల్‌లు లేని బ్రిడ్జిల వద్ద వాహనచోదకులు ఏ మాత్రం ఆదమరిచినా అంతే సంగతులు. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి బ్రిడ్జిల వద్ద ప్రమాదకరంగా ఉందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటు అధికారులు...అటు పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సుబ్ర హ్మణ్య షష్ఠి సందర్భంగా శనివారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామి వా రికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటంక గ్రామానికి చెందిన ఆవు ల నాగలక్ష్మి, ఆవుల కంచెప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సన్ని కన్నుల పండువగా జరిపిం చారు.
స్థానిక శింగనమల చెరువు నిండిన తరువాత వృథాగా పోయే నీరు సలకంచెరువు చెరువుకు వెళ్లేందుకు గత 22 సంవత్సరాలు కిందట రూ.40 లక్షలు ఖర్చుతో 10 కిలో మీటర్ల ఫీడల్ చానల్ ఏర్పాటు చేశారు. అయితే దాని ద్వారా ఇప్పటి వరకు సలకం చెరువుకు చుక్క నీరు కూడా చేరిన సందర్భంలేదు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిమో జకవర్గంలో వేగ వంతం చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పెర్కొన్నారు. మండలంలో ని నాయనవారిపల్లిలో టీడీపీ మండల కన్వీ నర్ గుత్తా ఆదినారాయణ ఏర్పాటు చేసి న విందు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణిశ్రీ, ఎంఎస్ రాజు, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమ డుగు కేశవరెడ్డి పార్టీ నాయకులు హాజరయ్యా రు.
పేదలకు అండగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గురవయ్యసేను కొట్టాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
పేరుకే నియోజకవర్గం కేంద్రం. ఎంతమంది పాలకులు మా రినా శింగనమల అభివృద్ధి శూన్యం. గ్రా మాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా మని గతంలో పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ఇంతవరకు చొరవ చూకపోవడం కొస మెరపు. 1952లో పుట్లూరు నియోజకవ ర్గం నుంచి శింగనమల నియోజకవర్గం గా మారింది.
గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎక్కడ చూసినా గంతలమయమైన రహదారులే దర్శనమిచ్చాయి. వా టిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు నర కయాతన పడ్డారు. ఈ రోడ్లకు కూటమి ప్రభుత్వంలో నైనా మోక్షం కలుగుతుందా...? అని మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
దాదాపు రెండు దశాబ్దాల కు పైగా మరుగన పడిన బ్రిడ్జి నిర్మాణా నికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. దీంతో ఆయా గ్రామాల ప్రజల ఆశల కు మోసులొచ్చాయి. పామిడి మండలం కత్రిమల, కోనేపల్లి, కోనేపల్లి తండా తదితర గ్రామాల ప్రజలు, రైతులు ని త్యం బ్యాంకు తదితర పనుల కోసం గార్ల దిన్నె మండలంలోని పెనకచెర్ల డ్యాం గ్రామానికి వెళ్తుంటారు. అలాగే ఆయా గ్రామాల విద్యార్థులు పెనకచెర్ల డ్యాం లోని పాఠశాలకు వెళ్తారు. అయితే వారికి సరైన దారి లేదు.
నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సంబంధిత మంత్రులకు విన్నవించా రు. ఆమె గురువారం అసెంబ్లీ సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవదాయ శాఖ మంత్రి అనం నారాయనరెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో అ శాఖలకు సంబంధించిన సమస్యలను వారికి వివరించారు.