Home » Siddaramaiah
గిరిజన సంక్షేమానికి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, తప్పుడు బ్యాంకు అకౌంట్లలోకి అక్రమంగా కార్పొరేషన్ అకౌంట్లలోని నిధులు బదిలీ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. షెల్ కంపెనీలకు తరలించిన నిధులను 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు ఈడీ చెబుతోంది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా రాష్ట్రానికి రావడంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై సూర్జేవాలా దృష్టి సారించనున్నట్టు చెప్పారు. పార్టీని పటిష్టం చేయడం కోసం వచ్చారని, ఆయన పని ఆయన చేస్తారని తెలిపారు.
చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఫంక్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని, కేఎస్‌సీఏనే నిర్వహించిందని ఆయన తెలిపారు.
ఆర్‌సీబీ వంటి ప్రైవేట్ క్రికెట్ ఫ్రాంచైస్ కోసం గ్రాండ్ రెసెప్షన్‌కు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని గిరీష్ కుమార్ ప్రశ్నించారు. ఐపీఎల్ అనేది కమర్షియల్ వెంచర్ అని, ఇందులో నేషనల్ ప్రైడ్ కంటే లాభాల ఉద్దేశమే ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్‌సీబీ ఐపీఎల్ టీమ్ విజయోత్సవాన్ని విభేదిస్తూ తాను సీఎంకు సలహా ఇచ్చానని గోవిందరాజ్ పేర్కొన్నట్టు ఒక కథనం వచ్చింది. అయితే తన మాటలను వక్రీకరించారని, ఈ అంశంపై తాను ఎప్పుడూ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వలేదని గోవిందరాజ్ వివరణ ఇచ్చారు.
ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, అలాగని ఘటనను సమర్ధించడం లేదని, కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. గాయపడిన వారిలో చాలామందికి చిన్నచిన్న గాయాలే అయ్యాయని, వారు ఆసుపత్రిలో చేరలేదని చెప్పారు.
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి.
కర్ణాటకలోని అనేకల్ తాలూకా సూర్యానగర్ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. కాగా, బ్యాంకు మేనేజర్ చర్యను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.
పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన మంజునాథ్‌రావ్, భరత్‌భూషణ్ మృతదేహాలు బెంగళూరు ఎయిర్‌పోర్టు ద్వారా స్వస్థలాలకు చేరి, మంత్రి, గవర్నర్, సీఎం నివాళులర్పించారు