Home » Shubman Gill
తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగే అని తెలిపాడు
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అఫ్గాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ భారత వన్డే, టెస్టు జట్లను ప్రకటించింది.
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ 99 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో గిల్ 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో తీవ్ర కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఊరటినిచ్చే వార్త వచ్చింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు.
ఐపీఎల్-2026 ఆరంభంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. శనివారం అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు గిల్ దూరమయ్యాడు.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. తమ ఓటమిపై స్పందించాడు.