Home » Shivraj Singh Chouhan
కొందరు అందరి ముందు మనుషుల్లా ప్రవర్తిస్తూ.. ఎవరూ లేని సమయంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. కొందరు కుటుంబ సభ్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తే.. మరికొందరు చిన్న పిల్లలపై, ఇంకొందరు జంతువులపై తమ పైశాచిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి...
మహిళా సాధికారిత దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 'లాడ్లీ బెహనా యోజన' కింద మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1.250 ఆర్థిక సాయం సోమవారం జమ కానుంది. ప్రతినెలా 10వ తేదీన ఈ సాయం మహిళల ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తం జమ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొనసాగిస్తారా, కొత్త పేరు తెరపైకి వస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడూ తన లక్ష్యం కాదని మంగళవారంనాడు తెలిపారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2023లో బీజేపీ 164 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. సీఎం ఎవరనేది బీజేపీ అధిష్ఠానం ఇంకా ప్రకటించనప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ శివరాజ్ సింగ్‌నే సీఎంగా కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఓటర్లను బెదిరిస్తే మామ బుల్డోజర్ సిద్ధంగా ఉంటుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అనుప్పూర్ జిల్లా జిజూరిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ప్రజలు శివరాజ్ సింగ్‌ను 'మామ' అని ఆప్యాయంగా సంబోధిస్తుంటారు.
బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సెహోర్ జిల్లా బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారంనాడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శివరాజ్ వెంట ఆయన భార్య సాధానా సింగ్ చౌహాన్ హాజరయ్యారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చిబాబాను సమాజ్వాదీ పార్టీ నిలబెట్టింది. 35 మంది అభ్యర్థులతో సమాజ్వాదీ పార్టీ నాలుగో జాబితాను శనివారం విడుదల చేసింది.
ఎట్టకేలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిరీక్షణ ఫలించింది. బీజేపీ ఆభ్యర్థుల నాలుగవ జాబితాలో ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. సాంప్రదాయంగా శివరాజ్ పోటీ చేస్తూ వస్తున్న బుధనీ నియోజకవర్గాన్ని ఆయనకు పార్టీ అధిష్ఠానం కేటాయించింది.
"మళ్లీ నేను సీఎం అవుతానా? కానా?'.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన ప్రశ్న ఇది. అదికూడా ఎన్నికల ర్యాలీలో. ఆసక్తికరమైన ఈ సన్నివేశం మధ్యప్రదేశ్‌లోని డిండోరిలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో చేటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీని తిరిగి గెలిపిస్తారా?'' అని ప్రశ్నించిన శివరాజ్ సింగ్...ఇందుకు స్పందించాల్సిందిగా ప్రజలను కోరారు.
మధ్యప్రదేశ్(Madyapradesh)లోని ఉజ్జయిని(Ujjain)లో లైంగికదాడికి గురైన పదిహేనేళ్ల బాలిక ఘటన యావత్తు దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. వీధుల్లో తిరుగుతున్న ఆమెకు కనీసం సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దేశాన్ని నివ్వేరపరిచింది. ఆమెపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్(Auto Driver) భరత్ సోనీనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి తండ్రి తన కొడుకును ఉరి తీయాలని డిమాండ్ చేశారు.