• Home » Sharad Pawar

Sharad Pawar

Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్

Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిపోయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ఇదంతా తమాషాగా మారిపోయిందని, చట్టమే ఇటువంటివాటికి అనుమతిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ న్యూఢిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి గురువారం మాట్లాడబోతున్న తరుణంలో సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

NCP Crisis: ఎన్సీపీ కొత్త చీఫ్‌గా అజిత్...జూన్ 30నే తీర్మానం జరిగిందన్న రెబల్ వర్గం

NCP Crisis: ఎన్సీపీ కొత్త చీఫ్‌గా అజిత్...జూన్ 30నే తీర్మానం జరిగిందన్న రెబల్ వర్గం

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. అజిత్ పవార్ ఎన్‌సీపీ కొత్త అధ్యక్షుడని ఆయన వర్గం బుధవారంనాడు ప్రకటించింది. జూన్ 30వ తేదీనే శరద్ పవార్‌‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించినట్టు ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గం నేత సునీల్ టట్కరే తెలిపారు.

Supriya Sule: టాటా, అమితాబ్‌‌ బచ్చన్‌ను చూడు?... అజిత్‌కు పవార్ కుమార్తె కౌంటర్

Supriya Sule: టాటా, అమితాబ్‌‌ బచ్చన్‌ను చూడు?... అజిత్‌కు పవార్ కుమార్తె కౌంటర్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వయసును ఎత్తిచూపుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ పవార్ కుమార్తె, ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే భగ్గుమన్నారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా పనిచేయడం లేదా అని ప్రశ్నించారు.

Sharad Pawar: పార్టీ గుర్తు మాతోనే ఉంది, ఎక్కడికీ పోలేదు..

Sharad Pawar: పార్టీ గుర్తు మాతోనే ఉంది, ఎక్కడికీ పోలేదు..

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తమతోనే ఉందని, ఎక్కడికీ పోలేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తమను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని తెలిపారు. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో పవార్ మాట్లాడారు.

Pawar Vs Pawar : ‘మీకు 83 ఏళ్లు, ఇక ఎప్పటికీ చాలించరా?’.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ వ్యాఖ్యలు..

Pawar Vs Pawar : ‘మీకు 83 ఏళ్లు, ఇక ఎప్పటికీ చాలించరా?’.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ వ్యాఖ్యలు..

పవార్‌ల మధ్య పవర్ గేమ్‌లో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గతంలో జరిగిన అంతర్గత విషయాలను బహిర్గతం చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో బీజేపీ, శివసేన విడిపోయినపుడు ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో ఎన్‌సీపీ ఐదు సమావేశాలను నిర్వహించిందని చెప్పారు.

Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు

Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్‌సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

Maharashtra : ‘ఎదగడానికి ఇదే అదను’ అంటున్న కాంగ్రెస్ నేతలు

Maharashtra : ‘ఎదగడానికి ఇదే అదను’ అంటున్న కాంగ్రెస్ నేతలు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక రావడంతో మహారాష్ట్రలో అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న శరద్ పవార్‌ (Sharad Pawar)కు సంఘీభావం ప్రకటిస్తూనే, తమ పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్తున్నారు.

Maharashtra : మహారాష్ట్ర పరిణామాల వెనుక శరద్ పవార్ హస్తం : రాజ్ థాకరే

Maharashtra : మహారాష్ట్ర పరిణామాల వెనుక శరద్ పవార్ హస్తం : రాజ్ థాకరే

మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Pawar Vs Pawar : శరద్ వర్సెస్ అజిత్.. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి?.. నేడు కీలక సమావేశాలు..

Pawar Vs Pawar : శరద్ వర్సెస్ అజిత్.. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి?.. నేడు కీలక సమావేశాలు..

మహారాష్ట్రలో ‘పవార్’ గేమ్‌లో కీలక ఘట్టం బుధవారం కనిపించబోతోంది. ఎన్‌సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ బలాబలాలు తేలిపోబోతున్నాయి. అధికార పక్షంతో చేతులు కలిపిన అజిత్ పవార్‌తోపాటు, మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూడా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురి మద్దతుదారులు తమ నేత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారు.

Sharad pawar: అనుమతి లేకుండా నా ఫోటోలు వాడొద్దు.. శరద్ పవార్ సీరియస్!

Sharad pawar: అనుమతి లేకుండా నా ఫోటోలు వాడొద్దు.. శరద్ పవార్ సీరియస్!

అజిత్ పవార్ తిరుగుబాటు వర్గం తన ఫోటో వాడుకోవడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా తన ఫోటో వాడుకోరాదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి