Home » Secunderabad
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో రేపు, ఎల్లుండి చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
సికింద్రాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందడుగు పడింది. నేషనల్ హైవే-44లోని మిలిటరీ డెయిరీఫాం వరకు 5.32 కిలోమీటర్ల మేర డబుల్‌డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రూ. 652 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. దీంతో త్వరలోను నగరంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న 32 రైళ్లకు స్టాప్‌లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖపట్టణం వెళ్లేందుకు స్టేషన్ కు కుటుంబ సభ్యులుతో కలిసి స్టేషన్ కు వచ్చింది. ఈలోగా ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అక్కడే ప్రసవించింది.
రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి బుధవారం విస్తృత తనిఖీలు చేశారు. భువనేశ్వర్ రైలులో 26.88 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.
సికింద్రాబాద్(Secunderabad) నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగర్ (సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్), దానాపూర్ (సికింద్రాబాద్ నుంచి బిహార్ ) ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మరో రెండు రైళ్లు రద్దయ్యాయి.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్పత్తులకు మూలాధారమైన ‘గిరి’ ట్రేడింగ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన షోరూంను సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసింది.
KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారు. త్వరలో మాజీ సీఎం అమెరికాకు వెళ్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ కేసీఆర్ పాస్‌పోర్టు రెన్యూవల్ చేసుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలోని పలు సెక్షన్లలో నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశామని, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారి సీపీఆర్‌ఓ శ్రీధర్ ప్రకటించారు.
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు ప్రయాణికులను తోటి ప్రయాణికుడు మోసం చేశాడు. దాంతో బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.