Home » Secunderabad
తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కరాజ్ భవన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు.
నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్, డెము, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కొద్ది రోజులు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.
మరమ్మతుల కారణంగా గ్రీన్ ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్ సింగ్(ADE Banothu Charan Singh) తెలిపారు.
అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన హైదరాబాద్ ఆర్చి డయోసిస్ మాజీ బిషప్ తుమ్మబాల పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ బసలిక చర్చిలో ఖననం చేశారు. తుమ్మబాల పోప్ సెయింట్ జాన్‌పాల్ 2 ద్వారా 1986 నవంబరులో వరంగల్ రెండో బిష్‌పగా నియమితులై 25 ఏళ్లు బిష్‌పగా పనిచేశారు.
ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు మరింత ప్రత్యేకం! జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు నిండుతాయి! పదేళ్ల పండుగ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయి ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే జరుగుతాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో ఓ నగల వ్యాపారి నుంచి రూ.13.16లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు సికింద్రాబాద్ జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mallareddy: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister Mallareddy) భావోద్వేగానికి గురయ్యారు. సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని సుచిత్రలో మల్లారెడ్డికి సంబంధించిన భూమి వివాదంలో(Suchitra Land Issue) ఉన్న ఈ విషయం తెలిసిందే. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే లక్ష్మణ్ పై(MLA Laxma Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు.
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్(Hyderabad)లో 6 గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్(Parliament Election Schedule) విడుదలైనప్పటి నుంచి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు.