Home » Schools
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ ఓ సర్క్యులర్‌ను జారీ చేశారు.
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. నగరంలోని సుమారు 40 పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
‘భోజనం నాణ్యత కోసం నియమించిన ప్రత్యేక అధికారి ఆమోదం తెలిపిన తరువాతే పిల్లలకు భోజనం వడ్డిస్తున్నాం. ఒకవేళ హాస్టల్‌లో భోజనం బాగోలేకపోతే.. మేడమ్ వస్తేనే తింటామని టీచర్లకు చెప్పాలంటూ పిల్లలకు సూచించాను.
జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఆర్ హైస్కూల్‌లో జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీఎంఓ అధికారులు ఆదేశించారు. కేఎ్‌సఆర్ హైస్కూల్‌లో పలువురు విద్యార్థులను ఓ టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళా టీచరే ఈ వ్యవహారం అంతా నడిపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ‘బడిలో లైంగిక వేధింపులు?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ ఫైర్ అయ్యారు. వెంటనే విచారించి నివేదిక ...
నగరంలోని కేఎ్‌సఆర్ హైస్కూల్‌లో బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు బయటికొచ్చిన ఓ ఆడియో కలకలం రేపుతోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులను ఓ స్కూల్ అసిస్టెంట్ కొంత కాలంగా వేధిస్తున్నాడని అందులో ఆరోపించారు. తమను తాకుతున్నాడని, గిల్లుతున్నాడని కొంద రు బాలికలు మాట్లాడిన ఆడియో బయటకు రావడానికి పాఠశాల ఉపాధ్యాయులలో అంతర్గత పోరు కారణమని...
ప్రభుత్వ పఠశాలల్లో చదువుకునే విద్యార్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా.. ‘స్పోకెన్ ఇంగ్లీష్’ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయించారు.
ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ (ఐఈఎస్) 2024 (సివిల్ ఇంజనీరింగ్)లో నారాయణ స్కూల్స్ పూర్వ విద్యార్థి రోహిత్ ధొండ్గే ఆలిండియా ఫస్ట్ (1) ర్యాంక్ సాధించాడు.
రాష్ట్రంలో పాఠశాలల పనివేళ లు పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుగా తయారైంది ‘అపార్’ వ్యవహారం. విద్యార్థులకు అపార్ ఐడీ క్రియేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని పాఠశాలల్లో ఆ ప్రక్రియను ప్రారంభించారు. దీనికోసం విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, తల్లిదండ్రుల ఆధార్ తీసుకురమ్మంటున్నారు. అన్నింట్లో వివరాలు ఒకేలా ఉండాలని చెబుతున్నారు. ఏ కొద్దిమందివో తప్ప.. సర్టిఫికెట్లు, ఆధార్‌లు ఏకరూపంగా లేవు. చిన్న చిన్న తేడాలున్నా సరిచేసుకుని ...