Home » Sajjala Ramakrishna Reddy
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సరిగ్గా ఆరు రోజుల్లో రాబోతున్నాయి. దీంతో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఇన్నాళ్లు వైనాట్ 175 అన్న వైసీపీ.. గెలిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక కూటమిలో అయితే.. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కుండ బద్ధలు కొట్టి చెబుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసిన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి (Electoral Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఫిర్యాదు చేశారు.ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య , దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
Andhrapradesh: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ క్యాబినేట్‌లో ఉన్న 40 మంత్రలు ఓడిపోతున్నారని.. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం మితి మీరిన జోక్యం చేసుకుంటోందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. సజ్జల వంటి సలహాదారులు ఇష్టం వచ్చిన విధంగా దూషిస్తున్నారన్నారు. మా వాళ్లపై వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల వారిని కొట్టినా నామ మాత్రపు సెక్షన్‌లు పెడుతున్నారన్నారు. నార్త్ ఏసీపీ ప్రసాద్, నున్న సీఐ దుర్గా ప్రసాద్‌లకు వెల్లంపల్లి పోస్టింగ్ వేయించారని బోండా ఉమ అన్నారు.
కేంద్రం పథకాలకు సొంత స్టిక్కర్లు వేసుకున్న చరిత్ర వైసీపీదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ఆరోపించారు. మోదీ పథకాలకు మీ జగన్ పేర్లు పెట్టుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు చెబితే సజ్జల రామకృష్ణారెడ్డికు (Sajjala Ramakrishna Reddy) అంత ఉలుకెందుకని ప్రశ్నించారు.
కేంద్ర ఎన్నికల సంఘం సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తనయుడు.. సజ్జల భార్గవ రెడ్డికి(Sajjala Bhargava Reddy) పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిపై(Chandrababu Naidu) వైసీపీ(YCP) తప్పుడు ప్రచారం చేస్తోందంటూ..
ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం వైసీపీ శ్రేణులకు అలవాటుగా మారిపోయింది.
పవన్ కల్యాణ్ భీమవరం సభలో చాకు కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. సదరు వ్యక్తుల కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెదకగా జేబులో చాకులు లభ్యమయ్యాయి. భీమవరం బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు. టూ టౌన్ పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు.
సినీనటులు చిరంజీవి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం మంచిదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.