Home » RSS
ఎన్నికల జాబితా నుంచి పేర్లు తొలగించడం, ఓట్లు కొనుగోలు చేయడం వంటి బీజేపీ ఎత్తుగడలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా అని మోహన్ భాగవత్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు.
మసీదు-ఆలయాల వివాదాలకు సంబంధించి ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇదే తరహా వివాదాలు రేకెత్తించడం ద్వారా తాముకూడా హిందూ నాయకులు కావచ్చనే అభిప్రాయంతో కొందరు ఉన్నారని, ఇది తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మోహన్ భాగవత్ అన్నారు.
రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎ్‌సఎస్) చీఫ్ మోహన్ భగవత్ శనివారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై కొలువు తిరిన దుర్గమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హిందూ కమ్యూనిటీని కూకటి వేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతోనే బంగ్లాలో హింస జరుగుతోందని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మాత్రమే కాదు, పాకిస్థాన్‌లోనూ హిందువులపై దాడులు జరుగుతున్నాయని, హిందువులపై దాడులను మనం ఎంతమాత్రం సహించరాదని సూచించారు.
సంతానోత్పత్తి రేటు ఏ దేశంలోనైనా 2.1 శాతానికి మించి ఉండాలని ఎలన్ మస్క్ తెలిపారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్‌లో ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని సూచించారు. ఈ అంశం దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఓవైసీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు..
స్వీయ రక్షణకోసం ప్రజాస్వామ్యబద్ధంగా హిందువులు గళం వినిపిస్తుంటే, ఆ స్వరాన్ని అణిచివేసేందుకు బంగ్లా ప్రభుత్వం చట్టవ్యతిరేక మార్గాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తోందని హోసబలే ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకుంటోందని అన్నారు.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఊహించని దాని కంటే భారీ విజయం సాధించిన ఎన్డీయే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పనుల్లో బిజీ అయిపోయింది.
హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. బలహీనంగా ఉండడమనేది నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన హిందువులకు సూచించారు. మనం బలహీనంగా ఉంటే మాత్రం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడమేనని ఆయన పేర్కొన్నారు.