Home » Royal Challengers Bangalore
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ ఈ శుక్రవారం నుంచే ప్రారంభంకానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా జట్లన్నీ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
టైటిల్ గెలవాలనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 ఏళ్ల నిరీక్షణకు వారి ఉమెన్స్ టీం తెరదించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్‌బాక్స్ ఈవెంట్‌లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కింగ్ అని పిలవొద్దని కోరాడు. అలా పిలవడం తనకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు.
డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును వారి పురుషుల జట్టు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2024 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. వైరల్ అయిన ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్‌తో కోహ్లీ ఆకట్టుకుంటున్నాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024కు సమయం ఆసయన్నమైంది. మార్చి 22 నుంచే ఈ మెగా లీగ్ ప్రారంభంకానుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు అంతా సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచే మెగా లీగ్ ప్రారంభంకాబోతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అన్ని ఫ్రాంచైజీలు టోర్నీ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ సెషన్‌లు ప్రారంభించాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నేటి నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగాడు. 20 బంతుల్లోనే అజేయ హాఫ్ సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. 5 ఫోర్లు, 3 సిక్సులతో ఏకంగా 250 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ ఊచకోత కోశాడు.
IPL: మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంతోపాటు ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించాడు.