• Home » Roja

Roja

AP Elections 2024: మంత్రి రోజాకు భారీ షాక్.. కీలక నేతల రాజీనామా

AP Elections 2024: మంత్రి రోజాకు భారీ షాక్.. కీలక నేతల రాజీనామా

ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) ముందు మంత్రి రోజాకు (Minister Roja) భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా ఆమెతో పాటు ఉన్న వైసీపీ కీలక నేతలు రోజా వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. ఆమె వైఖరి నచ్చక పలువురు నేతలు జగన్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో మంత్రి రోజా తీరుపై ఆగ్రహంతో నగరిలోని 5 మండలాల వైసీపీ నేతల రాజీనామాలు చేశారు.

AP Elections 2024: వైసీపీలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నా:  పృథ్వీరాజ్

AP Elections 2024: వైసీపీలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నా: పృథ్వీరాజ్

వైసీపీ (YSRCP)లో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని జనసేన నేత, నటులు పృథ్వీరాజ్ (Prithviraj) అన్నారు.ఈ ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడం ఖాయమన్నారు. జగన్‌కి కాదు, కూటమికే రెండు బటన్లు నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.అసభ్యంగా మాట్లాడే మంత్రులు ఎన్నికలయ్యాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసీపీ నేతలపై పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Minister Roja: నగరిలో రోజా నామినేషనా.. మజాకా? 250 కేసుల మద్యం డంప్..

Minister Roja: నగరిలో రోజా నామినేషనా.. మజాకా? 250 కేసుల మద్యం డంప్..

మంత్రి రోజా నామినేషన్ అంటే ఎలా ఉంటుంది? దుమ్ము లేచిపోతుందో లేదో కానీ లిక్కర్ మాత్రం పొంగి పొర్లుతోంది. పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్ చేయడం జరిగింది. సుమారు 250 కేసుల మద్యాన్ని ఒక ప్రైవేటు కళాశాలలో వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు డంప్ చేశారు. రాత్రి ఒంటి గంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు పట్టుబడ్డాడు.

Chandrababu: జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు.. మంత్రి రోజాపై చంద్రబాబు విసుర్లు

Chandrababu: జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు.. మంత్రి రోజాపై చంద్రబాబు విసుర్లు

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలో పదవి ఇస్తామని రూ.40 లక్షలు తీసుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో అడుగడుగునా అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడికి అడ్డూ అదుపు లేదన్నారు.

AP Politics: మంత్రి రోజాకు బిగ్ షాక్.. ఏకంగా 5 మండలాల నేతలు కలిసి..

AP Politics: మంత్రి రోజాకు బిగ్ షాక్.. ఏకంగా 5 మండలాల నేతలు కలిసి..

సొంత నియోజకవర్గంలో మంత్రి రోజాకు(Minister Roja) బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా నగరి(Nagari) నియోజకవర్గ ఐదు మండలాల వైసీపీ(YSRCP) నాయకులు ఆమె వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ నియోజకవర్గానికి రోజా వొద్దని, ఆమెకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్‌ను అభ్యర్థించారు. ‘జగనన్న ముద్దు - రోజా వద్దు’ అంటూ నగరి నియోజకవర్గ 5 మండలాల

Thadepalligudem: సీఎం జగన్ వద్దకు మంత్రి రోజా పంచాయితీ.. వైసీపీలో బయటపడుతున్న విభేదాలు

Thadepalligudem: సీఎం జగన్ వద్దకు మంత్రి రోజా పంచాయితీ.. వైసీపీలో బయటపడుతున్న విభేదాలు

మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజాపై(Minister Roja) అసమ్మతి స్వరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో చిత్తూరు జిల్లా వైసీపీకి(YSRCP) కొత్త తలనొప్పులు వస్తున్నాయి.

AP News: నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు బిగ్ షాక్!

AP News: నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు బిగ్ షాక్!

వెఎస్సార్‌సీపీ (YSRCP) కీలక నేత మంత్రి రోజాపై (Minister Roja) సొంత నియోజకవర్గం నగరిలో (Nagari) తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.సొంత పార్టీ నేతలే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తేలేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజాకు బిగ్ షాక్ ఎదురైంది. నగరి నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించారు. మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని వారు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీలతో గెలుపొందగా నగరిలో రోజా మాత్రం అంతటి వేవ్‌లోనూ 2 వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారని వారు ప్రస్తావించారు.

Roja: పవన్‌తో పాటు బండ్ల గణేష్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు..

Roja: పవన్‌తో పాటు బండ్ల గణేష్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు..

రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు పవన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత బండ్ల గణేష్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్నాళ్ళయిందని ప్రశ్నించారు.

Bandla Ganesh: బాబోయ్.. రోజాను బండ్ల గణేష్ ఇన్ని మాటలు అన్నారేంటో?

Bandla Ganesh: బాబోయ్.. రోజాను బండ్ల గణేష్ ఇన్ని మాటలు అన్నారేంటో?

ఏపీ మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజా డైమండ్ రాణి అని.. రేవంత్ ఫైటర్, జగన్ ఆక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారన్నారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి.. పులుసు రాణి మాత్రమే కాకుండా రోజా ఐటం రాణి అని పేర్కొన్నారు.

Roja: వైఎస్ఆర్ ఎప్పుడో జగన్, షర్మిళకు ఆస్తులు పంచారంటూ రోజా సంచలనం

Roja: వైఎస్ఆర్ ఎప్పుడో జగన్, షర్మిళకు ఆస్తులు పంచారంటూ రోజా సంచలనం

మంత్రి రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిళకు రాజకీయ అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు భర్తీ చెయ్యని డీఎస్సీ పోస్టులను జగన్ భర్తీ చేశారన్నారు. 6100 పోస్టుల భర్తీకీ ప్రస్తుతం జగన్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి