Home » Renuka Chowdary
Telangana: ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సై అంటున్నారు. తనను ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయమంటే రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్‌సభకు పోటీ చేయమంటే చేస్తానని రేణుక తన మనసులో మాట బయటపెట్టారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ప్రధాని మోదీ, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ విషయంలో ప్రలోభాలు పనిచేయవని గెలిచే నేతలకే కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇస్తుందని ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి రేణుక చౌదరి (Renuka Chowdary) తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నేడు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది
రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని వివరించారు. హడావిడిగా 22వ తేదీన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని శంకరాచార్యులు, మఠాధిపతులు వ్యతిరేకించారని తెలిపారు.
Telangana: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి రేణుకాచౌదరి బస్సులో ప్రయాణించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 58 స్థానాల్లో లీడింగ్‌లో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి స్పందించారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ 'బాంబు' పేల్చారు.
కొత్తగూడెం బీఆర్‌ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై మాజీ ఎంపీ రేణుకా చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఖమ్మంలో అరాచకంపై బటన్ నొక్కి తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేడు తుమ్మలకు మద్దతుగా కురవి మండలం బలపాల గ్రామస్తులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ బలపాల గ్రామస్థులు అండగా ఉన్నారన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో అరాచకం రాజ్య మేలుతుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ( Renuka Chowdhury ) అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.