Home » Rajnath Singh
పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిన ఆపరేషన్ సిందూర్ విజయంపై బీజేపీ తిరంగయాత్ర నిర్వహించనుంది. 13 నుంచి 23 మే వరకు 11 రోజుల పాటు ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది.
ప్రధానమత్రి నరేంద్ర మోదీ 2018లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో ప్రారంభించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా లక్నో యూనిట్‌ను ప్రకటించారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్లో ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తారు.
ఆపరేషన్ సింధూర్ కేవలం మిలట్రీ చర్య మాత్రమే కాదని, భారతదేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సత్తా ఏమిటో చూపించామని, ఉగ్రవాదులు, వారి మాస్టర్లు సరహద్దులు వెంబడి ఉన్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు.
పాక్, పీవోకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది.ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి తెలిపారు.
కుతంత్రాలు చేస్తూ కపటనాటకాలాడితే చావుదెబ్బ తీస్తామంటూ పాకిస్థాన్ ను హెచ్చరించారు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ సమగ్రతే టాప్ ప్రయారిటీ అని..
పహల్గాంలో ఉగ్రవాదులు 25 మంది టూరిస్టులు, ఒక కశ్మీర్ పోనీ రైడ్ ఆపరేటర్‌ను అత్యంత పాశవికంగా హత్య చేశారని, ఇందుకు ప్రతిగా ఉగ్రవాదులపై దాడి చేసే హక్కును భారత్ సమర్ధవంతంగా ఉపయోగించుకుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
Sindhoor Success: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపట్టింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, పౌరుల భద్రతను మెరుగుపర్చేందుకు కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించగా, పాకిస్థాన్ నిరంకుశంగా ఉన్నట్లు చైనా మరోసారి ప్రకటించింది
ఆదివారంనాడిక్కడ జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్‌లో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్కింగ్ స్టయిల్, దృఢ సంకల్పం అందరికీ తెలిసిందనేనని, మోదీ నాయకత్వంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుందని అన్నారు.
హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్లో హైపర్సోనిక్ స్ర్కామ్‌జెట్ కంబస్టర్ పరీక్ష విజయవంతం. ఈ విజయంతో హైపర్ సోనిక్ క్షిపణుల సాంకేతికతలో India ముందడుగు వేసింది