Home » Rajnath Singh
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సోమవారం నుండి మూడు రోజులపాటు UKలో పర్యటించనున్నారు. 22 ఏళ్ల తరువాత భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి యూకేలో పర్యటించడం ఇది రెండోసారి.
భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకల పై వరుస డ్రోన్ దాడులు జరుగుతుండటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో దాక్కునా వేటాడి మరీ పట్టుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు.
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆదివారం ఉదయం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా భారత దేశ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హజరుకానున్నారు.
బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణకు చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలంతా తమ అగ్ర నేతలకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో అమిత్ షా ఆర్మూర్ బయలుదేరారు.
భారత సాయుధ బలగాల్లో పనిచేసే మహిళా సోల్జర్లకు కేంద్ర దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో సేవలందిస్తున్న మహిళా సోర్జర్లు, సైలర్లు, ఎయిర్ వారియర్లకు మెటర్నిటీ, చైల్డ్ కేర్, చైల్డ్ అడాప్షన్ లీవులను మంజూరు చేయాలనే అసాధారణ ప్రతిపాదనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత ఈ దేశంలోని సిక్కు కమ్యూనిటీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని గురుద్వారా ఆలంబాఘ్‌లో గురుగ్రంధ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో ఆదివారంనాడు ఆయన పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు భారత్-చైనా సరహద్దుల్లోని తవాంగ్ జిల్లా బమ్ లా పాస్ ప్రాంతాన్ని సందర్శించారు. బమ్ లా పాస్ ఆవలివైపున ఉన్న చైనా పీఎల్ఏ పోస్టులను పరిశీలించారు. సరిహద్దు భద్రతా జవాన్లను కలుసుకుని వారితో దసరా వేడుకల్లో పాలుపంచుకున్నారు.
భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే సాయుధ బలగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. త్రివిద దళాలు రక్షణ శాఖ ఆర్థిక వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
భారత వైమానిక దళానికి(Indian Airforce) అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం యాడ్ అయింది. C-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సోమవారం భారత వైమానిక దళంలోకి చేరింది. హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.