Home » Rajasthan
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం సీఎం అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య గొడవలున్నాయంటూ ప్రధాన మంత్రి నరేంద్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను గెహ్లాట్ శుక్రవారంనాడు తిప్పికొట్టారు. కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలంటూ సచిన్ పైలట్ ఓటర్లకు పిలుపినిచ్చిన వీడియోను ఆయన సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను 'పిక్ పాకెట్' తో పోలుస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడు భరత్పూర్లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా ప్రధాని మోదీ...
ప్రధాన నరేంద్ర మోదీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారంనాడు విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ చాలా నెర్వస్తో ఉన్నారని, ఇటీవల ఆయన రాష్ట్రంలో జరిపిన రోడ్షో పెద్ద ఫ్లాప్ అని అన్నారు.
వెనుకబడిన వర్గాలకు అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లా ఖైర్తాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్షా పాల్గొన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో అడుగుపెడుతుందో.. అక్కడ నేరాలు, అవినీతి రాజ్యమేలుతాయని ఆరోపణలు చేశారు. ఓవైపు భారత్ ఈ ప్రపంచానికి ఒక నాయకుడిలా ఎదిగితే
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు పార్టీ నేతలు బుధవారం తెలిపారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు వికలాంగుల కోసం ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తొలి విడత పోలింగ్లో 12,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని, చాలావరకూ టిక్కెట్ల పంపిణీ సజావుగా జరిగిందని రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తెలిపారు. ముఖ్యమంత్రితో గత విభేదాలపైనా ఆచితూచి స్పందించారు. జరిగిందేదే జరిగిపోయిందని, ఏం చెప్పామో, ఏం మాట్లాడామో వాటిని మరిచిపోయి కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు.
రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించామని, నీళ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, రోడ్ల అనుసంధానం వంటివి తమ ప్రభుత్వం కల్పించిదని చెప్పారు.