Home » Raghurama krishnam raju
రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ - జనసేన ( TDP - Janasena ) పార్టీల తరపునే పోటీకి సిద్ధంగా ఉన్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ( MP Raghurama Krishnamraju ) స్పష్టం చేశారు. నాలుగేళ్ల అనంతరం శనివారం నాడు ఏపీలోని భీమవరానికి రఘురామ వచ్చారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు సొంత నియోజకవర్గం నరసాపురానికి వచ్చారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నేతలు ప్రేమతో ఆదరించారన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు సొంత నియోజక వర్గం రానున్నారు.
సంక్రాతి పండుగకు తన సొంత నియోజకవర్గం నరసాపురానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. చట్ట నిబంధనలు పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghuramakrishna Raju ) ఏపీ హైకోర్టు ( AP High Court ) లో గురువారం నాడు పిటీషన్ వేశారు. సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని రఘురామ పిటీషన్‌లో తెలిపారు.
వైసీపీ ( YCP ) అరాచక పాలనపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ( MP Raghuramakrishnam Raju ) ప్రాణాన్ని పణంగా పెట్టి అలుపెరిగిన పోరాటం చేస్తున్నారని ఎంపీ రఘురామ తనయుడు కనుమూరి భరత్ ( Kanumuri Bharat ) తెలిపారు. మంగళవారం నాడు ఉండి మండలం మహదేవపట్నంలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామరాజుతో పాటు కనుమూరి భరత్ పాల్గొన్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) స్పష్టం చేశారు. సోమవారం నాడు ఢిల్లీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుందని ఈ కార్యక్రమంలో అభిమానులు, జనసేన -టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావాలి’’ అని ఎంపీ రఘురామ పిలుపునిచ్చారు.
సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు ఉపయోగపడుతుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుపై గురువారం నాడు లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రఘురామ కృతజ్ఞతలు తెలిపారు
లోక్‌సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై జగన్ ప్రభుత్వాన్ని ( YCP GOVT ) వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు. రఘురామ ఏమన్నారంటే... ‘‘ఏపీలో గ్రామస్వరాజ్యానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.569కోట్లలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు వెళ్లలేదని ఎంపీ రఘురామ అన్నారు.
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ( Chevireddy Bhaskar Reddy ) ప్రగతి భవన్‌లో కూర్చొని సర్వే చేసి బీఆర్ఎస్ ( BRS ) పార్టీని ఈ ఎన్నికల్లో ఎలా గెలిపించాలనే దానిపై చర్చించలేదా, బీఆర్ఎస్ గెలుపు కోసం ఆయన పని చేయలేదా అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు.