Home » Putin
రష్యాలో అత్యంత శక్తిమంతమైన కిరాయి సైన్యాధిపతి యెవ్‌జెనీ ప్రిగోజిన్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన జీవితం చిల్లర దొంగతనాలతో ప్రారంభమైంది. 1980వ దశకంలో ఆయనపై అనేక దొంగతనం కేసులు నమోదయ్యాయి.
రష్యా రాజధాని నగరం మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఆదివారం ఉదయం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. దీంతో మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసేశారు. నగర శివారు ప్రాంతంలో ఓ డ్రోన్‌ను కూల్చేయగా, మరో రెండిటిని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ దెబ్బతీసింది. ఇవి ఓ కార్యాలయం భవన సముదాయంలో కూలిపోయాయి. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.
జోహానెస్‌బర్క్‌లో జరుగనున్న బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ హాజరు కావడం లేదు. ఉక్రెయిన్‌పై పుతిన్ చర్యల కారణంగా ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గత మార్చిలో అరెస్టు వారెంటు జారీ చేసింది. పుతిన్ బ్రిక్స్ సదస్సుకు వస్తే ఆయనను దక్షిణాఫ్రికా అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న పాకిస్థాన్, చైనాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కడిగిపారేశారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని, దీనిని కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. దీనిపై మనమంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. షాంఘై సహకార సంఘం (SCO) వర్చువల్ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మోదీని రష్యాకు గొప్ప మిత్రునిగా ఆయన అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్‌వర్క్ ఈ వివరాలను వెల్లడించింది.
యెవ్జెనీ ప్రిగోజిన్ సారథ్యంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఈ వారాంతంలో చేసిన తిరుగుబాటును కేవలం 24 గంటల్లోనే అణిచివేసిన రష్యా అధ్యక్షుడు వ్యాడిమిర్ పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాగ్నర్ గ్రూప్ యోధుల్లో చాలా మంది దేశభక్తులున్నారని, వారిని ప్రభుత్వ సైన్యంలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.
కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తిరుగుబాటుతో రష్యాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాజధాని నగరం మాస్కోతోపాటు పలు రష్యన్ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ నగరం రోస్తోవ్-ఆన్-డాన్‌లోని మిలిటరీ హెడ్‌క్వాటర్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొడతానంటూ తిరుగుబావుటా ఎగురువేసిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ ప్రిగొజిన్.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తనపై తిరుగుబాటుదారు, దేశద్రోహి అని నిందలు వేసి అధ్యక్షుడు పుతిన్ తీవ్రమైన తప్పు చేశారని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌పై యుద్ధకాండను కొనసాగిస్తున్న రష్యాకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఉక్రెయిన్‌పై నిర్విరామ యుద్ధంలో రష్యాకు మద్ధతుగా పోరాడుతున్న కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ (Wagner Group) తిరుగుబావుటా ఎగురవేసింది. రష్యన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అవసరమైన అన్ని అడుగులు వేస్తామని ప్రకటించింది.
రష్యా (Russia) రాజధాని నగరం మాస్కోపై అనేక డ్రోన్లతో దాడి జరిగింది. అయితే నష్టం స్వల్పమేనని, ఎవరూ తీవ్ర స్థాయిలో గాయపడలేదని నగర మేయర్ సెర్గీ సొబ్యనిన్ ఓ ప్రకటనలో తెలిపారు.