Home » Purandeswari
మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ( Chegondi Hariramazogaiah ) ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ( Daggubati Purandeshwari ) మర్యాదపూర్వకంగా కలిశారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్ల అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి: పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్ధిక సహకారం మంజూరు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి డిమాండ్ చేశారు.
AP News: జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్ వద్దకు పోలీసులను పంపడం చాలా ఘోరం అన్నారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ విమర్శించారు.
అల్లూరి జిల్లా ( Alluri District ) లో అక్రమ బాక్సైట్ మైనింగ్ మాఫియా ( Bauxite Mining Mafia ) జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి ( Daggubati Purandeswari ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు అల్లూరిజిల్లా పాడేరులో పర్యటించారు. పాడేరులో నిర్మాణంలో ఉన్నా మెడికల్ కాలేజీ, 516E హైవేని పరిశీలించారు. పాడేరు కుమ్మరిపుట్టులో కల్తీమందు తాగి మరణించిన రాజారావు కుటుంబాన్ని పరామర్శించారు. అల్లూరిజిల్లాలో మూడు నియోజక వర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే అప్పుల ఊబిలో ఎలా కురుకు పోయిందో చూస్తున్నామని చెప్పారు. బీజేపీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పురంధరేశ్వరి అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంలో పురందేశ్వరి స్వాగతించటంలో తప్పులేదని, చంద్రబాబు వదిన కావటం వల్ల స్వాగతించి ఉండవచ్చన్నారు. పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టింది చంద్రబాబు కుటుంబం కోసమేనని మండిపడ్డారు.
విశాఖపట్నంలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ( Daggubati Purandhareswari ) తెలిపారు.
దళిత బంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతుందని.. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) తెలిపారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) వ్యాఖ్యానించారు.