Home » Punjab Kings
యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది ఒక గొప్ప వరంగా మారింది. క్రికెట్‌లో తమ ప్రస్థానం కొనసాగించేందుకు గాను ఈ టోర్నమెంట్ వారికి ఎంతగానో సహాయపడుతోంది. అయితే.. అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేవలం కొందరు మాత్రమే తమ సత్తా చాటుకోగలుగుతున్నారు.
మంగళవారం పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సాధించిన విజయంలో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో సందేహం లేదు. కీలకమైన వికెట్లు కోల్పోయి జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు.. అతను అద్భుత ప్రదర్శన కనబరిచి తన జట్టుకి భారీ స్కోరు అందించడంలో సహాయం చేశాడు.
ఐపీఎల్ 2024 (IPL 2024) 17వ సీజన్‌లో ఈరోజు కీలకమైన 23వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య ముల్లన్‌పూర్(Mullanpur)లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. PBKS, SRH ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 2 గెలిచి పాయింట్ల పట్టికలో వరుసగా 5, 6వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నాయి.
గత ఏడాది డిసెంబరు 19న జరిగిన ఐపీఎల్(IPL) వేలంలో ఛత్తీ్‌సగఢ్ క్రికెటర్ శశాంక్ సింగ్‌ను(Shashank Singh) పంజాబ్ కింగ్స్(Punjab Kings) కొనుగోలు చేసిన సందర్భంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. శశాంక్ పేరుతో ఇద్దరు వేలంలో నిలిచారు. శశాంక్‌ను పీబీకేఎస్ సొంతం చేసుకున్నట్టు ఆక్షనీర్ మల్లికా ..
ఐపీఎల్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో పోరుకు సిద్దమైంది. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది.
ఐపీఎల్ 2024(ipl 2024)లో ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఈరోజు నెక్ట్స్ మ్యాచుకు సిద్ధమైంది. ఈ ఆరో మ్యాచ్ తమ సొంత స్టేడియం బెంగళూరు( Bengaluru) చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్ ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన సామ్ కర్రాన్(63) పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. లివింగ్‌స్టోన్(38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు నెలకొల్పిన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలుపు బాట పట్టింది.
పంజాబ్ బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేసినప్పటికీ.. చివర్లో అభిషేక్ పోరెల్(10 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ సాధించింది. పంజాబ్ కింగ్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం ఢిల్లీకి మైనసైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మ్యాచ్‌లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.
Preity Zinta: మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా పెద్ద పొరపాటే చేసింది. పొరపాటున తమ లిస్ట్‌లో లేని ఆటగాడిని కొనేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.