Home » Priyanka Gandhi
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ రామ్ నగర్‌లో ప్రియాంక శనివారం నాడు ప్రచారం చేశారు. త్యాగం గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బీజేపీలో ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ప్రియాంక విమర్శలు చేశారు. దేశం కోసం ఎంత చేసినా సరే తమ కుటుంబాన్ని అవమానిస్తారని మండిపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో దీర్ఘకాలంగా గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి రాహుల్ పారిపోయారనే విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అమేథిలో రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీచేసి గెలుపొందారు. దీంతో తనకు సురక్షితమైన సీటుగా భావించి..
స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసింది. సాధారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ఎవరైనా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి ఓ వింత అనుభవం ఎదురుకానుంది.
రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావాలని అమేథి నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. అమేథి ప్రస్తుత ఎంపీ స్మృతీ ఇరానీ వల్ల నియోజకవర్గ ప్రజలు బాగా నిరాశకు గురయ్యారని చెప్పారు.
సినీ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తాజాగా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు అయ్యారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.
లోక్ సభ ఎన్నికల వేళ బీహార్ కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది. ప్రాంతీయ పార్టీ జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ హామీ మేరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశామని జన్ అధికార్ పార్టీ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేయడం వల్ల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో గల కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గురువారం సమావేశమై చర్చించింది. సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ పాల్గొన్నారు. భారత్ న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ వర్చువల్‌గా పాల్గొనాలి. అనివార్య కారణాల వల్ల పాల్గొనలేదు.