• Home » Pressmeet

Pressmeet

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...

43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ అని, ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో... సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు.

AP News: ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా యువకులు ఆత్మహత్యాయత్నం..

AP News: ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా యువకులు ఆత్మహత్యాయత్నం..

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఇప్పటికే అనేక ఆరోపణలతో వివాదాస్పదమైన ఆయన.. అలవాల రమేష్ రెడ్డిపై విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై గిరిజన యువకులు, మహిళలు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రమేష్ రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

Minister Narayana: ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం..

Minister Narayana: ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం..

ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనతో ఏపీ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాజధాని అమరావతిని అసలు పట్టించుకోలేదని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాస్‌ను పిలిపించి భవనాల నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు.

TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్

TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్

మాజీ మంత్రి విడదల రజిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. రజినీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి జాషువా స్టేట్‌మెంట్, ఇతర అధికారుల స్టేట్‌మెంట్‌లు కూడా ఉన్నాయన్నారు. తాను వైయస్సార్సీపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా తాను మాట్లాడలేదని.. కానీ..

CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..

CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..

భక్తులకు అన్నప్రసాద వితరణ చెయ్యడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్ట్‌ను తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని అస్పత్రుల ద్వారా రాయలసీమలో వుండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రపంచంలో వున్న వైద్యులు తిరుపతిలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించి.. స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు.

 KTR: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు...

KTR: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు...

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు కావాలని అడగరని..ఉన్న పరిశ్రమలను ఉంచాలని కోరరని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదన్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని విమర్శించారు.

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Crime News: అకౌంటెంట్‌‌పై యాసిడ్ దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు..

Crime News: అకౌంటెంట్‌‌పై యాసిడ్ దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు..

హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్‌ నర్సింగ్ రావుపై యాసిడ్ దాడి జరిగింది. 'హ్యాపీ హోలీ' అంటూ దుండగుడు అకౌంటెంట్‌ తలపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో అకౌంటెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

BRS మాజీమంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

BRS మాజీమంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటారా.. రేవంత్ రెడ్డి.. మీకు సంస్కారం ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతున్నదని, కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి.. మాట సమర్థించుకుంటున్నారని, కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

YS Jagan: ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్

YS Jagan: ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్

గతంలో ప్రతిపక్షంలో ఉన్నామని, కన్నుమూసి కన్ను తీరిచేలోపు ఏడాది గడిచిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత వైసీపీ పాలనలో అన్నీ వర్గాలను అక్కున చేర్చుకున్నామని,వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకమని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి