• Home » Pressmeet

Pressmeet

Harishrao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు

Harishrao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. అయితే వీరి మరణాలపై అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Minister Atchannaidu: ఆ హోదా స్పీకర్, చంద్రబాబు ఇచ్చేది కాదు.. ఎవరు ఇస్తారంటే..: అచ్చెన్న

Minister Atchannaidu: ఆ హోదా స్పీకర్, చంద్రబాబు ఇచ్చేది కాదు.. ఎవరు ఇస్తారంటే..: అచ్చెన్న

అసెంబ్లీ కి అన్నిపార్టీలు. వచ్చాయని, వైసీపీ నేతలు నల్ల కండువాలు వేసుకుని వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అధిక స్థానాలు వున్న వారికి అధికార పక్షం రెండవ స్థానం వచ్చిన వారికి ప్రతిపక్షం ఇస్తారని, మరి వైసీపీలో 11 మంది గెలిచి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారని.. జగన్ వింత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

Minister Komatireddy: బీఆర్ఎస్ నేతలకు మానవత్వం లేదు: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy: బీఆర్ఎస్ నేతలకు మానవత్వం లేదు: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ నేతలకు మానవత్వం లేదని.. ఎస్ఎల్‌బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిరంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. తూప్రాన్ రైలు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం వెళ్లి పరమర్శించలేదని విమర్శించారు. మీరు చేయని పనులు మేము చేస్తున్నామని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు.

YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు

YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని కురసాల కన్నబాబు స్పస్టం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు మడత పెట్టి బీరువాలో పెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయని, అవి చంద్రన్న పగ, దగా పథకాలు మాత్రమేనని విమర్శించారు.

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

గుంటూరు మిర్చి యాడ్‌కు వెళ్లిన జగన్‌కు భద్రత ఇవ్వకుండా హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలన్నారు.

Kesineni Nani.. రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..

Kesineni Nani.. రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..

ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని మాజీ ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు: ఈటల రాజేందర్

BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు: ఈటల రాజేందర్

ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని ఆయన పేర్కొన్నారు.

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

ప్రయోగ్‌రాజ్ కుంభమేళాలో జరుగుతున్న తీరును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

YSRCP.. వల్లభనేని వంశీ అరెస్టుపై బొత్స స్పందన

YSRCP.. వల్లభనేని వంశీ అరెస్టుపై బొత్స స్పందన

వల్లభనేని వంశీ అరెస్టును మాజీ మంత్రి బొత్స సత్యానారయణ ఖండించారు. కేసు వెనక్కు తీసుకుంటే మళ్ళీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసనమండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.

KTR.. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా..: కేటీఆర్

KTR.. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా..: కేటీఆర్

స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఆ ఇంటికి ఉన్న గేటును బ్యాంక్ సిబ్బంది ఎత్తుకెళ్లారని.. మరి రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని.. మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి