Home » Praneeth Rao
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు (Praneeth Rao) మూడో రోజు కస్టడీ విచారణ ముగిసింది. దర్యాప్తు బృందం (Investigation Team) అతడిని దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణలో భాగంగానే.. ప్రణీత్‌తో కలిసి పనిచేసిన అధికారుల వివరాలు దర్యాప్తు బృందం సేకరించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్‌ను ప్రణీత్ రావు విన్నట్టు తేలింది. సాధారణంగా ఎస్‌ఐబీలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుంది. అందుకోసం నోడల్ అధికారి ఒక లింక్‌ను ఎస్ఐబీ వారికి ఇస్తారు. కానీ అనధికారికంగా కొన్ని సాఫ్ట్‌వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (SIB) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసుల ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ప్రణీత్ రావు ఉన్నారు. కాగా.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చిక్కిన ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. పలువురు ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని అధికారులు విచారించారు. ప్రణీత్ రావు కేసులో 6 గురు సభ్యులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసుకోవడం సాధారణమే..! ప్రణీత్‌రావు ఏకంగా ఎస్‌ఐబీ కేంద్రంగా పలు జిల్లాల్లో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అలియాస్ ప్రణీత్‌కుమార్ పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణలో స్టేట్ మెంట్ రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసుల ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు.