Home » Ponnam Prabhakar
ప్రజాపాలనలో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.9,200.32 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సర్వ శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మెను విరమించుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సూచించారు. సమ్మెను విరమించుకుంటే... వారి ఇబ్బందులను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.
నవోదయ విద్యాలయాన్ని వంగరలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వారసత్వం లేకుండా నాటి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చిన వ్యక్తి పీవీ అని చెప్పారు.
పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను విమర్శించినట్లు ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ ఊరుకుంటారా అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను విమర్శించినట్లు ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఊర్కుంటారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
గురుకులాల్లో ఆహార కల్తీ ఘటనలకు ఆస్కారం లేకుండా ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను అధికారులకు అప్పగించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఏ తప్పూ చేయకపోతే.. విచారణకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇప్పుడు దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందనే భయంతోనే అసెంబ్లీలో చర్చించాలని అంటున్నారని మండిపడ్డారు.
స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు.
డ్రగ్స్ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. సినీ ప్రముఖులు, రాజకీయనాయకులున్నా డ్రగ్స్ ఇతర కేసుల్లో ఎంత పెద్దవారున్నా వదిలేదిలేదన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లను భ్రష్టు పట్టించారని మంత్రి పొన్న ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్స్‌పై శాసన సభలో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. హాస్టల్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.