Home » Ponguru Narayana
Andhrapradesh: విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులకు రేపటి (సెప్టెంబర్ 6) నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని 179 వార్డు, మూడు గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు.
వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 2014-19మధ్య గత టీడీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి రూ.41వేల కోట్లతో టెండర్లు ఇచ్చామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని నాశనం చేసి కూర్చుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి ఆయన సతీమణి, జెడ్పీ ఛైర్‌పర్సన్ అరుణమ్మ టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నివాసానికి విజయకుమార్ రెడ్డి, అరుణమ్మ దంపతులు వెళ్లడంతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వారు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు జిల్లావ్యాప్తంగా విస్తృత చర్చలు నడుస్తున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల(Tidco houses)ను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) అన్నారు. రానున్న మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన యువ షూటర్ మనుభాకర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఒలింపిక్స్ షూటింగ్ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సైతం ఆమె రికార్డు సృష్టించడంతో పెద్దఎత్తున అభినందనలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. దేశం గర్వించదగ్గ పని చేశావంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ సమావేశం నిర్వహించారు. మొదటి ఫేజ్‌లో భాగంగా పెందుర్తి, రెండో ఫేజ్‌లో గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో యూజీడీ పనులు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 24 గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ(Minister Narayana) సమీక్ష నిర్వహించారు. సిటీస్(CITIIS)ఛాలెంజ్ ప్రాజెక్టు కింద మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 24గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) సమీక్ష నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్(MLA Naseer), మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షలో పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై మంత్రి వారితో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంతగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను పవిత్రంగా చెయ్యగలుగుతామని, అలా మనస్సును పవిత్రస్థితి వైపు నడిపించే పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలు రెండింటిని ఆవిష్కరించే భాగ్యం కలిగించిన పరమాత్మకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.