Home » Pinnelli Ramakrishna Reddy
కారంపూడి సీఐ నారాయణస్వామి(CI Narayana Swamy)పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నారాయణస్వామిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కారంపూడిలో సీఐ నారాయణస్వామి శాంత్రిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారని, తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఏపీ హైకోర్టు(AP High Court)ను పిన్నెల్లి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సీఐను విధులకు దూరంగా ఉంచాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించారు. దీంతో సీఐ నారాయణస్వామిని విధుల నుంచి ఈసీ తప్పించింది.
న్యూఢిల్లీ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని.. పోలీసులకు ఆదేశించాలంటూ బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన పైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్ట్ అనుమతించింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడ? పోలింగ్ నాడు, మర్నాడు జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం కూడా ఉంది.
ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది..
6 హత్యలు.. 79 దాడులు.. దోపిడి 2 వేల కోట్లు..! ఇదీ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) పైశాచికం. ఇలా ఒక్కో అరాచకాన్ని వివరిస్తూ 23 పేజీల పుస్తకాన్ని ‘పిన్నెల్లి పైశాచికం’ పేరిట టీడీపీ (TDP) రిలీజ్ చేసింది. నిజంగా ఈ బుక్‌ను నిశితంగా పరిశీలిస్తే..
మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14మంది, మాచర్ల టౌన్‌కు చెందిన 10మంది, మాచర్ల రూరల్‌కు చెందిన 22మంది, కారంపూడి మండలానికి చెందిన ఆరుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డిలో పరారై పల్నాడు జిల్లా నరసారావుపేటలో ప్రత్యక్షమయ్యారు..