Home » Pinnelli Ramakrishna Reddy
ఛలో మాచర్లకు (Chalo Macherla) తెలుగుదేశం పార్టీ (TDP) గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ (YSRCP) మూకల దాడుల్లో గాయపడిన బాధితులను టీడీపీ నేతలు పరామర్శించనున్నారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి (Julakanti Brahma Reddy) ఇంటి నుంచి నేతల బృందం బయలుదేరింది.
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీవీప్యాట్ మెషీన్ ధ్వంసం కేసులో ఇరుక్కున్న మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.
పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(Pinnelli Ramakrishna Reddy) బాగోతం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి నరసరావుపేట కోర్టు ఆవరణలో లోంగిపోతారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి పహారా కాస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ బుత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో.. ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఇప్పటికే సీఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం, అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్న పరిణామాలపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తొలిసారి స్పందించారు. ఈవీఎంను పిన్నెళ్లి ధ్వంసం చేస్తున్న వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేయలేదని స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కేపి గూడెం, రాయవరం పోలింగ్ బూత్‌లపై దాడులు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెంట్లపై హత్యాయత్నం చేశారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్ రేక్యానాయక్‌పై వైసీపీ గూండాలు హత్యాయత్నం చేశారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా...
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా... లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు. ‘నేను ఎక్కడికీ పారి పోలేదు.
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.