Home » Pinnelli Paisachikam
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడ? పోలింగ్ నాడు, మర్నాడు జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం కూడా ఉంది.
ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది..
6 హత్యలు.. 79 దాడులు.. దోపిడి 2 వేల కోట్లు..! ఇదీ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) పైశాచికం. ఇలా ఒక్కో అరాచకాన్ని వివరిస్తూ 23 పేజీల పుస్తకాన్ని ‘పిన్నెల్లి పైశాచికం’ పేరిట టీడీపీ (TDP) రిలీజ్ చేసింది. నిజంగా ఈ బుక్‌ను నిశితంగా పరిశీలిస్తే..