Home » Phone tapping
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్ చేసినట్టు సమాచారం.
అప్పట్లో... తెలంగాణలో కేసీఆర్ సర్కార్! ఏపీలో... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్! ఇద్దరి మధ్యా మంచి సన్నిహిత సంబంధాలు! దీంతో... తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్ ‘నిఘా’ వేసినట్లు తేలింది.
Phone Tapping Scandal: సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష ,వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు.
SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ ముందు సాక్షిగా హాజరయ్యారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
Phone Tapping Case: ఏ రాజకీయ నేత, పార్టీ ఉండకూడదని.. తామే శాశ్వతంగా ఉండలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మూమెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేశారని మండిపడ్డారు.
Sharmila Phone Tap: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు తెలియ వచ్చింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మంగళవారం మరోసారి సిట్ విచారణకు రానున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆయనను అధికారులు విచారించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దీనికి సంబంధించి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలటంతో, వారి నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్‌కుమార్‌ల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేయించానని సిట్ అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం.
Prabhakar Rao SIT Inquiry: ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.