Home » Perni Nani
గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని..
10 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయకపోతే తన మేనేజర్‌తో హైకోర్టులో క్వాష్ పిటీషన్ ఎందుకు వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Andhrapradesh: రేషన్ బియ్యం మిస్సింగ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. రికార్డులతో పాటు సీపీయూ సీజ్ చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు.
పేదల బియ్యాన్ని పందికొక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానీని ఉరి తీయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
గోదాముల నుంచి పీడీఎస్ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయినా మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం పోలీసుల ముందు హాజరు కాలేదు.
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల బియ్యాన్ని నాని పందికొక్కులా తిన్నారని, ఆయన్ని వెంటనే ఊరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు మాత్రం మరోలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల్లో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని, చిక్కుకున్నారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
Perni Nani - PDS Rice Bags: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి. ప్రస్తుతం బందరు రాజకీయాలకు దాన్ని అన్వయించే పరిస్థితి ఏర్పడింది. అధికారం ఉన్నా, లేకున్నా, రాజకీయ నేతలు కుంభకోణాలు, వివిధ అవినీతి ఆరోపణల్లో..