Home » Paris
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీ విజయం సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ప్యారిస్ నుంచి ముంబై బయలుదేరిన విస్తారా ఎయిర్‌వేస్ విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దించారు. విమానంలోని ప్రయాణికులను దింపివేసి.. విమానాన్ని టెర్మినల్ వద్దకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ప్యారిస్‌లోని ఓర్లి ఎయిర్ పోర్ట్‌లో 70 శాతం విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రెంచి పౌర విమానయాన అధికారులు శనివారం ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ఏటీసీ) సమ్మెకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
విలన్‌ను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌లో తీసుకువెళ్తారు.. అతని అనుచరులు దారి మధ్యలో కాపుకాసి, వ్యాన్‌ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకొని పోతారు.. ఎన్నో సినిమాల్లో ఈ సీన్ చూసి ఉంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్‌లో ఓ గ్యాంగ్ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్‌ను ఆపి మిషన్ గన్‌లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకొని పోయింది. ఈ గ్యాంగ్ జరిపిన దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ఫైనల్స్ దూసుకెళ్లి అదరగొట్టారు. మరోవైపు లక్ష్య సేన్ మాత్రం నిరాశ పరిచారు.
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేసిన పీవీ సింధుకి మళ్లీ పరాభవం ఎదురైంది. ఇదే టోర్నమెంట్‌లో లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ కోసం తమ జోరును కొనసాగించారు.
డిజైనర్లు రూపొందించిన దుస్తులలో తమ అందాన్ని ప్రదర్శించాలని మోడల్స్ ఉవ్విళ్లూరుతారు. కానీ ఈ మోడల్ అవస్థ చూస్తే..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం యూరోపు దేశాల పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన న్యాయవాదులు, విద్యార్థులు, భారతీయ మూలాలుగల ప్రజలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈఫిల్ టవర్ బాంబు బెదరింపు కాల్ రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. టవర్లోని ఫ్లోర్‌లన్నింటినీ ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను ఫ్రాన్స్‌లో కూడా వినియోగించుకునే అవకాశం లభించింది. భారతీయ పర్యాటకులు భారతీయ కరెన్సీలో తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫ్రాన్స్‌లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.