Home » Pahalgam Terror Attack
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె పాకిస్థాన్ టూర్‌కి సంబంధించి రాసుకున్న డైరీ దర్యాప్తు సంస్థలకి చిక్కింది.
పహల్గామ్‌లో అమాయకులను బలితీసుకున్న నలుగురు ఉగ్రవాదులు పరి పంజల్ పర్వత శ్రేణిలో దాక్కున్నట్టు నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి.
పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. భద్రతా వైఫల్యం, మృతులపై వివరణ కోరుతూ హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది.
ఉత్తరప్రదేశ్ కుషినగర్ మెడికల్ కాలేజీలో జన్మించిన 17 ఆడపిల్లలకు ’ఆపరేషన్ సిందూర్’ స్ఫూర్తితో తల్లిదండ్రులు ’సిందూర్’ అనే పేరు పెట్టారు. పాకిస్థాన్‌పై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సిందూర్ స్మరించేందుకు ఈ పేరు పెట్టినట్లు తల్లిదండ్రులు చెప్పారు.
Pahalgam Terror Attack: జీ7 దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్ తీరును తప్పుబట్టాయి.
1947లో పంతంతో మన కన్నా ఒక రోజు ముందు (ఆగస్టు 14) స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది పాకిస్థాన్. కానీ, ఈ 8 దశాబ్దాల్లో ఒక విఫలదేశంగా ప్రపంచం ముందు నిలబడింది.
సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే శాఖ తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈనెల 6న జారీ చేసింది.
ఉగ్రవాదులను గుర్తించడం, వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవడంలో ప్రజలిచ్చే సమాచారం మరింత కీలకమవుతుందని ఎన్ఐఏ బుధవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకేదైనా సమాచారం ఉంటే వాటిని స్థానికులు, టూరిస్టులు, విజిటర్లు తమతో షేర్ చేసుకోవాలని కోరింది.
ఉగ్రమూకలపై భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పై రష్యా స్పందించింది.. భారత దాడిలో 10 మంది తన కుటుంబ సభ్యులు మృతి చెందారని ఉగ్రనేత మసూద్ అజార్ ప్రకటించారు.
పహల్గాంలో ఉగ్రదాడికి మూడ్రోజుల ముందు ప్రధాని మోదీకి నిఘా సమాచారం అందింది. ఈ కారణంగా జమ్మూ-కశ్మీరు పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు, అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు.