Home » Osmania university
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో నిరసనలు, ఆందోళనలు, ప్రదర్శనలను నిషేధిస్తూ రిజిస్ర్టార్ ఈ నెల 13న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. నినాదాలతో దద్దరిల్లింది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలపై నిషేధం విధిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి.
Osmania University: ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు పలు సమస్యలపై ఆందోళనలు చేస్తుంటారు. అయితే ఆందోళనలపై అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో ఈ కొత్త రూల్ చర్చనీయాంశంగా మారింది.
KTR: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పారు.
యూనివర్సిటీలకు కీలకమైన వైస్ చాన్స్‌లర్ల(వీసీ) నియామకంలో రాజకీయాలకు తావులేకుండా ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చింది.
ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత నెలకొంది. సెమిస్టర్(Semester)ను వాయిదా వేయాలని సైన్స్ విద్యార్థులు అడ్మిన్ బిల్డింగ్‌ను ముట్టడించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై మాలలు భగ్గుమన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ ఆరోపించింది.
విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)’ రూపొందించిన ముసాయిదాను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి వెళతాయని ఆందోళన చెందుతోంది. ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ కేంద్రానికి లేఖ రాయనుంది.
ఉస్మానియాలో రోగులకు 15 ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ‘గుండెను పరీక్షించలేని ఉస్మానియా’ శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది.
ఓయూలో అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 7 ఎకరాల సువీశాల విస్తీర్ణంలో నిర్మించిన అతిపెద్ద బాలుర హాస్టల్ భవనం(Boys' hostel building) సిద్ధమైంది. ఈ భవనాన్ని ప్రారంభించడానికి ఓయూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.