Home » Operation Sindoor
పహల్గాం ఉగ్రదాడి అంశంలో పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఆపాలని ఏ ప్రపంచ నేత కూడా భారత్‌ను అడగలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా ప్రకటించారు.
పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు మనదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపించారు.
ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం కేవలం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదని, ఉగ్రవాదాన్ని భారత్ ఎంత మాత్రం సహించదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్ అధికార ప్రతినిధులుగా మారాయని ప్రధాని మోదీ విమర్శించారు. భారత్ సైన్యం విజయవంతంగా సర్జికల్స్ స్ట్రైక్స్ జరిపితే రుజువులు చూపించాలని అడుగుతోందని, అయితే సాక్ష్యాలకేమీ కొదవలేదని అన్నారు మోదీ.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ప్రపంచంలో ఏ నేత తమకు ఫోన్ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా..
హహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు, వృద్ధులు చనిపోయారని, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహాదేవ్ పర్వత ప్రాంత పరిసరాలను కశ్మీర్ హిందువులు ప్రస్తుత సావన్ (శ్రావణ) మాసంలో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రాంతం నుంచి ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చైనా తయారీ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ 'టీ82' యాక్టివేట్ అయినట్టు సైనికులు గుర్తించారు.
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటర్ ఐడీ కార్డులు, చాకొలెట్ రేపర్లు పాకిస్థాన్‌లో తయారైనవేనని అమిత్‌షా చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజు మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
భద్రతా లోపాల కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రర్ ఇన్‌ఫ్రా నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని నిలదీశారు.
నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పహల్గాం ఉగ్రదాడి నిరూపిస్తోందని అఖిలేష్ విమర్శించారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను తమకు ప్రయోజనకారిగా ప్రభుత్వం మార్చుకుంటోందని ఆరోపించారు.