Home » Operation Sindoor
భారత ప్రజలపై ఎలాంటి టెర్రరిస్టు దాడులకు పాల్పడినా రెట్టింపు బలంతో విరుచుకుపడతామని ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు సష్టమైన సంకేతాలిచ్చాయని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్‌షా అన్నారు.
పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌లపై జరిపిన దాడుల్లో భారత్ పైచేయి సాధించినట్టు అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువరించింది. పాక్ అడ్డగోలు వాదనలను కొట్టివేసింది. దాడులకు ముందు, దాడులకు తర్వాత అంటూ 'న్యూయార్క్ టైమ్స్' శాటిలైట్ ఫొటోలతో కథనం ప్రచురించింది.
Operation Sindoor Dummy Aircraft: పహల్గాం ఉగ్రదాడి తర్వాత 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాక్ ఉగ్రమూకలకు దిమ్మతిరిగే షాకిచ్చింది భారత్. ఈ చర్యతో రగిలిపోయిన దాయాది దేశం చైనా, తుర్కియే, అజర్‌బైజాన్ అండ చూసుకుని ఓ వ్యూహం పన్నింది. అయితే, మన భారత వాయుసేనలు రివర్స్ అటాక్ చేసి పాకిస్థాన్‌ను ఫూల్ చేశాయి. డమ్మీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎరగా వేసి దుష్ట పాక్‌ను ఎలా దెబ్బతీశాయంటే..
పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రచారం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందనీ, అయితే ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఈ విషయాన్ని కూడా ప్రపంచ దృష్టికి మనం తీసుకెళ్లాలని ఒవైసీ అన్నారు.
పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిందని, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాదులకు పట్టున్న ప్రాంతాల్లోకి దూసుకెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల లిస్ట్ పంపాలంటూ అన్ని పార్టీలను కేంద్రం కోరింది. అనంతరం ప్రతినిధుల బృందం జాబితాలను ప్రకటించింది.
Operation Sindoor: భారత్ దాడిలో కీలక ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. పాక్ ఆయువు పట్టు నూర్ ఏయిర్ బేస్‌పై భారత్ మిస్సైల్స్ దాడి నిజమేనని ఆయన స్వయంగా చెప్పారు. తాజాగా జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణి చైనా, పాకిస్తాన్ దేశాల్లో లేదని అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు, రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సర్ ప్రశంసలు కురిపించారు.
Operation Sindoor: కాంగ్రెస్‌కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య హీట్ పుట్టిస్తున్నారు ఎంపీ శశిథరూర్. హస్తం పార్టీ వద్దన్నా ఆయనకు ఆహ్వానం పంపింది మోదీ సర్కారు. అసలు శశిథరూర్ చుట్టూ ఏం జరుగుతోంది.. ఆయన సెంటరాఫ్ ది డిస్కషన్‌గా ఎందుకు మారారు.. అనేది ఇప్పుడు చూద్దాం..
Tiranga Rallies: ఏపీ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ చేపట్టారు.