Home » Ongole
ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనంటూ ఎమ్మార్పీఎస్, అది రాజ్యాంగ విరుద్ధమంటూ మాలమహానాడు, దాని అనుబంధ సంఘాలు పోటాపోటీగా నినదించాయి.
రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని కొంత సమయం కావాలని 7, 8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు.
కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్‌కు ఆయన లేఖ రాశారు.
తీసుకున్న అప్పు ఎగ్గొట్టడమేకాక, పోలీసులమంటూ బెదిరించి మరికొంత నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
చివరి బస్సు అందకపోవడంతో తెల్లవారేవరకూ బస్టాండ్‌లోనే విశ్రమించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అవుట్‌పోస్టు కానిస్టేబుల్ లాఠీతో చితకబాదాడు.
సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్టు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
Andhrapradesh: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టును ఒంగోలు పోలీసులు రట్టుచేశారు. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ దొంగలను పట్టుకున్నారు. 100 దేవాలయాల్లో 300 వెండి ఆభరణాలను చోరీ చేసిన ముఠాను పోలీసులు పట్టుకోవడంపై హోంమంత్రి అనిత అభినందించారు.
సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్‌పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.