Home » Old City
పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్‌దర్వాజా మహాకాళి(Laldarwaja Mahakali) బోనాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ చంద్రశేఖర్ ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు.
గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం (టీఎస్ న్యాబ్) పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తనను చితకబాది అక్రమ కేసు బనాయించారని...
హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పీఎస్‌కు కూత వేటు దూరంలో ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్న ప్రియురాలిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
పాతబస్తీ బహదూర్‌పూర్‌లో డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సయ్యద్ అనే వ్యక్తి తన భార్య ఉన్నీసాలేతో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నాడు. నాలుగేళ్లుగా సయ్యద్ దంపతులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
పాతబస్తీలో ఓ బైక్‌కు నిప్పు అంటుకొని బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. ఈఘటనలో పది మందికి గాయాలు అయ్యాయి.ఈ ప్రమాదం భవనీనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనానికి అంటుకున్న మంటలు ఆర్పుతుండగా బైక్ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది.బాధితుల్లో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉంది. అందులో ఓ పోలీసు ఉన్నట్లు సమాచారం.
భాగ్యనగర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మార్గంలో మెట్రో రైలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సుమారు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పాతబస్తీ మెట్రో(Old City Metro) శంకుస్థాపన కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతులమీదుగా శుక్రవారం జరిగింది. ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మార్చి 8వ తేదీన ఓల్డ్ సిటీ మెట్రోకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్(MGBS) నుంచి ఫలక్‌నుమా వరకు ఓల్డ్ సిటీ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. 5.5 కిలో మీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో పనులను చేపట్టింది.
Telangana Parliament Elections: హైదరాబాద్ (Hyderabad) పార్లమెంట్ ఎంఐఎం అడ్డా.. 2004 నుంచి ఈ నియోజకవర్గం మజ్లిస్‌దే..!. ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారయన. అంతకుమునుపు 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసద్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కడంతో కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోష్‌లో పార్లమెంట్ స్థానాలను సైతం ఎక్కువగానే సాధించాలని వ్యూహ రచన చేస్తోంది...