Home » Odisha
ఒడిశాలో మాజీ బ్యూరోక్రాట్ వీకే పాండ్యన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.
ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న బీజేపీ(BJP).. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రమాణ స్వీకార తేదీని జూన్ 10గా నిర్ణయించగా.. తాజాగా దానిని 12కు వాయిదా వేశారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో బీజేపీ పెద్దలంతా బిజీ బిజీగా గడపనున్నారు.
రాజకీయ జీవితం దాదాపు ముగిసిందనుకున్న దశలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (65)కు అత్యంత కీలక బాధ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఆయనకు కబురుపెట్టారు.
ఒడిశాలో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఆ పార్టీని జనం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎమ్మెల్యేలతో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సమావేశం అయ్యారు. తమ పార్టీ అధికారం చేపట్టేనాటికి ఒడిశాలో పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తుచేశారు.
యోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిరం నిర్మించిన అక్కడి ఓటర్లు బీజేపీని ఆదరించలేదు. ఫైజాబాద్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన లల్లు సింగ్ ఓడిపోయారు. దాంతో బీజేపీ శ్రేణులు, నేతుల షాక్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దాంతో బీజేపీ స్టాండ్ అయోధ్య నుంచి ఒడిశాకు మళ్లిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఒడిసా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని ఏలిన నవీన్ పట్నాయక్‌కు ప్రజలు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి, దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది.
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఒడిశాలో నాలుగు దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీ బోణి కొట్టే అవకాశాలున్నాయని ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలను గెలుచుకోనుంది.