Home » Odisha
బీజేడీ, బీజేపీ మధ్య బంధాన్ని బద్దలుకొట్టి ఒడిసాలోనూ తెలంగాణ తరహా ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిసా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రలోక్ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిని ప్రస్తావించారు. అకస్మత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వెనుక కారణం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని.. పాకిస్థాన్ అంటే ఆ పార్టీ భయపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) సంచలన విమర్శలు చేశారు.
ఒడిశాలో అధికారం అందుకోవడం కోసం బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటుందని.. అయితే అది తమ పార్టీ విజయానికి దోహదం చేస్తుందని బీజేడీ నాయకుడు వీకే పాండ్యన్ వెల్లడించారు. ఒడిశాలో వరుసగా ఆరోసారి బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఒడిశా ముఖ్యమంత్రితో తనకున్న సత్సంబంధాలను ప్రధాని పక్కకు పెట్టేశారు. దీనికి కారణంపై మోదీ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా సమాధానం ఇచ్చారు. ఒడిశా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఆపని చేసినట్టు చెప్పారు.
రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్‌లో ‘వారి’ జాడలే లేవన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్‌లో భాగంగా శనివారం ఒడిశాలోని ఆరు కీలక పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. వీటిలో పూరి, భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, శంబల్‌పూర్, కోంఝార్ నియోజకవర్గాలు ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తన ఆరోగ్యంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.
అవినీతిపై ఒడిశాలోని బిజూ జదనతాదళ్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రభుత్వం కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకోనుండటం ద్వారా ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.