Home » Odisha
ఒడిసాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నేత, గిరిజన నాయకుడు మోహన్ చరణ్ మాఝీ ఒడిసా ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం
ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా కనక వర్దన్ సింహ్ దేవ్, ప్రవటి పరిదా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
తొలిసారి ఒడిసాలో అధికారం దక్కించుకున్న బీజేపీ.. గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. కియోంజర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీ
ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారంనాడు ప్రకటించింది. దీనికి ముందు శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా మాఝీ ఎన్నికైనట్టు అధిష్ఠానం తరఫున పర్యవేక్షకులుగా హాజరైన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ ప్రకటించారు.
తాజాగా జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతుంది.
‘‘ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ పార్టీలను చూస్తుంటే.. ఇతరుల కోసం గొయ్యి తవ్వేవాడు ఏదో ఒకరోజు అదే గుంతలో పడిపోతాడు అని స్పష్టమవుతోంది’’ అని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్పర్సన్ సుప్రియా శ్రీనతే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌లు మోదీతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె ఎక్స్‌లో షేర్ చేశారు.
ఒడిశాలో మాజీ బ్యూరోక్రాట్ వీకే పాండ్యన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.
ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న బీజేపీ(BJP).. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రమాణ స్వీకార తేదీని జూన్ 10గా నిర్ణయించగా.. తాజాగా దానిని 12కు వాయిదా వేశారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో బీజేపీ పెద్దలంతా బిజీ బిజీగా గడపనున్నారు.
రాజకీయ జీవితం దాదాపు ముగిసిందనుకున్న దశలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (65)కు అత్యంత కీలక బాధ్యత దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఆయనకు కబురుపెట్టారు.