Home » Nizamababad
తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.
Kavitha Arrest: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది..