Home » New Zealand
కొద్ది రోజులగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ప్రపంచకప్ అతి కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ పూర్తి కావడంతో టాప్-4 జట్లు సెమీ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్లనూ ఓడించిన టీమిండియా బుధవారం జరగబోయే మొదటి సెమీ-ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టబోతోంది.
Team India: వన్డే ప్రపంచకప్‌లో నాలుగు సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారయ్యాయి. ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తన లక్ష్యాన్ని నిర్ణీత ఓవర్లలో చేరుకోకపోవడంతో ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు దూరమయ్యాయి. దీంతో అధికారికంగా తొలి సెమీస్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని స్పష్టమైంది. రెండో సెమీస్ ఈనెల 16న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా వేదికగా జరుగుతుంది.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో నాలుగో సెమీస్ బెర్త్ దాదాపు న్యూజిలాండ్ కైవసం చేసుకున్నట్లే భావించాలి. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది.
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజృంభించింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. పెద్ద పెద్ద జట్లను చిత్తుగా ఓడించి సంచలన విజయాలు సాధించిన అప్ఘానిస్థాన్ జట్టు ఎవరూ ఊహించని రీతిలో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.
వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తోె జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచినట్లు అంపైర్లు వెల్లడించారు.
బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్ తృటిల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.
వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్‌తో పోటీ ఉంటుందని అందరూ భావించగా దక్షిణాఫ్రికా మాత్రం ఏకపక్షంగా గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంలోకి వెళ్లింది.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సఫారీలు భారీ స్కోరు సాధించారు.