Home » New Delhi
ఈనెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 కేసులు తొలిసారిగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రత తక్కువగా ఉండటం, కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటం ఊరటగా చెప్పాలి.
పాక్తో గూఢచర్యానికి పాల్పడిన కారణంగా ఇటీవల అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై విచారణ సందర్భంలో పాక్ హైకమిషన్ సిబ్బంది పేరు వెలుగుచూసిందని తెలుస్తోంది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో టర్కీ దేశం బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే బ్యూరో ఆఫ్ సెక్యూరిటీ అండ్ సివిల్ ఏవియేషన్ భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలకు సేవలందిస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సెలెబికి సెక్కూరిటీ నిర్వహణ అనుమతిని రద్దు చేసింది.
ఆప్ నాయకత్వంలో ఎంసీడీ పనితీరుతో తాము అసంతృప్తిగా ఉన్నట్టు కౌన్సిలర్ హిమాని జైన్ తెలిపారు. ఆ కారణంతోనో తాను, మరికొందరు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి 'ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు చెప్పారు.
న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో కొత్త మల్టీ-ఏజెన్సీ సెంటర్ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ వ్యూహాత్మక్మ వృద్ధి, నిర్వహణ సామర్థ్యాలకు 'ఆపరేషన్ సిందూర్' ఓ ఉదాహరణ అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ అధికారిని భారత్ మంగళవారం నాడు 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించింది. ఆయనను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు మంగళవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజేఐగా ఖన్నా పనితీరును బార్ సీనియర్ లాయర్లు ఈ సందర్భంగా ప్రశంసించారు.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఢిల్లీ యూనివర్సిటీల్లో విద్యార్థులకు సెలవులు ఇచ్చి, రైళ్ల రిజర్వేషన్లు, విమాన చార్జీలలో పెరుగుదలతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ భవన్లో వారికి వసతి, భోజన సౌకర్యాలు అందించి, రైళ్ల రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తున్నారు
India Pakistan War: పాకిస్థాన్ తన నక్కబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. భారత్తో పోరాడటం చేతగాక విద్వేష ప్రచారాలు, ఫేక్ న్యూస్ ప్రాపగండాను వైరల్ చేస్తూ పరువు తీసుకుంటోంది.
భారత బలగాలు కచ్చితమైన లక్ష్యాలు ఛేదించడం మనమంతా గర్వించదగని విషయం అని మోదీ చెప్పగానే క్యాబినెట్ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేసారు. ఆపరేషన్ వ్యూహాత్మకంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరక్కుండా కచ్చితంగా అమలు చేశారని ప్రధాని వివరించారు.