Home » Nellore
Kakani: క్వార్జ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకుండా రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు.
ISRO: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి రీశాట్-1బీ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఆదివారం ఉదయం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ61 ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇందు కోసం కౌంట్‌డౌన్ శనివారం ఉదయం ప్రారంభైంది.
రూ.8,500 కోట్లతో అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్‌లో 339 అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Police Hunt For Kakani: రెండు నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి కాకాణి. హైదరాబాద్, బెంగళూరులో కాకాణి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Tirumala:వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
ఆంధ్రజ్యోతి పాఠకులకు కార్ అండ్ బైక్ రేసుకు సంబంధించి రాష్ట్రస్థాయి లక్కీడ్రాలో కారును గెలుచుకున్న ఏపీ లోని నెల్లూరు నగరవాసి జొన్నాదుల కోటేశ్వరరావుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం చెక్కు అందజేశారు.
నెల్లూరు జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 65 మంది గాయపడ్డారు. కందుకూరులో కూలీల ట్రక్కు బోల్తా పడగా, రాపూరులో భక్తులతో వెళ్ళిన ఆటో ప్రమాదానికి గురైంది
నెల్లూరులో షేర్స్ పెట్టుబడిగా చూపించి సైబర్ నేరగాళ్లు రూ.30.62 లక్షలు మోసపోయారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగేంద్ర, పెట్టుబడుల చీటింగ్ కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మోడల్‌గా మార్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. కేవలం 60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు రూ.41 కోట్లతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు.
Minister Anam Ramanarayana Reddy: పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం నాడు అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.