Home » NDA Alliance
బడ్జెట్ 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న ఏడో బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన కీలక బడ్జెట్‌ల గురించి తెలుసుకుందాం.
సొంత ప్రతాపం కొంత ఉంటే, జబ్బలు ఎంత చరుచుకున్నా ఒక అందం. అరువు బలం మీద ఆధారపడి, అంతా తమ ప్రతాపం అంటేనే వికారం. మొదటికే మోసం వచ్చినా, మూడోసారి మహాప్రసాదమని మురిసిపోతున్న ప్రధాని మోదీ...
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పేద ప్రజలకు ఇసుక లేకుండా చేశారని ఫలితంగా నిర్మాణ రంగం కుదేలైందని జనసేన నాయకులు బండి రామకృష్ణ (Bandi Ramakrishna) విమర్శించారు. ఉచిత ఇసుక అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఈరోజు(మంగళవారం) సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
దేశం నుంచి నల్లధనాన్ని ఏరివేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం 2016లో 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకొంది.
లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
తనను టార్గెట్ చేసి సభ నుంచి బహిష్కరించినందుకే లోక్ సభలో బీజేపీకి 63 మంది సభ్యుల బలం తగ్గిందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)దుయ్యబట్టారు.
కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అయితే ఈ చట్టాలు అమలు చేసే ముందు ఉభయ సభల్లో సరైన చర్చ జరగలేదని విపక్షాల నుంచి ప్రధానంగా ఎదురవుతున్న ఆరోపణ. ఈ ఆరోపణల్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఖండించారు.
ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ జరిపే 'మన్ కీ బాత్'(Mann Ki Baat) కార్యక్రమం ఇవాళ పునఃప్రారంభించారు. మోదీ(PM Modi) మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జరిగిన తొలి మన్ కీ బాత్ ఇదే.
కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్‌కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
తెలంగాణలో రేవంత్ సర్కార్ కూల్చివేతకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్కెచ్ గీశారా..? కేంద్రలోని బీజేపీ పెద్దలతో చేతులు కలిపి.. కూల్చివేత కుట్రకు ప్లాన్ చేస్తు్న్నారా..? ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారు..? పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమయ్యారు..? ఎక్కడున్నారు..?..