Home » Nalgonda News
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్(BRS పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదేవరుసలో మరో కీలక నేతల కూడా గులాబీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి(Tera Chinnapa Reddy) రాజీనామా చేశారు.
కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే సమయం లేదని.. అక్రమంగా మామూళ్లు వసులు చేయడంలో వారు అరితేరారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కరువు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నల్గొండ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లో ఓల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులకు వేల రూపాయల నష్టం కలగచేస్తున్నాయని చెప్పారు.
యాదగిరి గుట్ట (Yadagirigutta) లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న(సోమవారం) పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం సీఎం రేవంత్ దంపతులు, నల్లొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ బల్లాపై కూర్చున్నారు. అయితే బల్లాపై ప్లేస్ లేకపోవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓ చిన్న స్టూల్ మీద కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Nalgonda News: మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత బలమైన, శక్తివంతమైన పార్టీగా వెలుగొందిన బీఆర్ఎస్ పార్టీ(BRS) పరిస్థితి ఇప్పుడు అత్యంత ధీనంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఓటమి తరువాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు పార్టీని వీడగా.. మిగిలిన నేతలు సైతం బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..
Nalgonda News: రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశాడు ఓ భర్త. అర్థరాత్రి పక్కా ప్లాన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి వీరి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. ఈ ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది. భార్యను(Wife), ఆమె ప్రేమికుడిని(Lover) ఇద్దరినీ పోలీసులకు(Nalgonda Police) అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka ) అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి.
తంబాకు ఇవ్వలేదని తోటి వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు, జరిమానా విధించింది.
గడియారం సెంటర్ నుంచి మర్రిగూడ బైపాస్ వరకు కట్టిన బీఆర్‌ఎస్ పార్టీ తోరణాలతో ప్రధాన రహదారి గులాబిమయమైంది.
నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద ఘొర రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతిచెందాడు. మాజీ సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్‌ను పోలీస్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు.