Home » Nagarjuna
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన, చేస్తున్న వారిని గడగడలాడిస్తోంది.
చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) మరో కీలక చర్య చేపట్టింది.
ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని సినీ నటుడు నాగార్జున తెలిపారు.
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అక్రమంగా ఎన్నో నిర్మాణాలు చేపట్టారని.. సీఎం రేవంత్ రెడ్డి వాటిపై ముందు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైడ్రా.. హైడ్రా.. ఇప్పుడీ పేరు ఒక్క హైదరాబాద్‌లోనే ఎక్కడ చూసినా మార్మోగుతోంది..! అటు పొలిటికల్.. ఇటు సినీ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది..! ఈ పేరు వింటేనే హడలెత్తిపోయే పరిస్థితి..!
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు. నిబంధనల మేరకే ఎన్ కన్వెన్సన్ నిర్మాణం జరిగిందని వివరించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
రూల్ ఫర్ ఆల్ అంటోంది రేవంత్ సర్కార్. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించమని తేల్చి చెబుతోంది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాల లిస్ట్‌ను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌లో కొంతభాగం ఆక్రమించిందే. దాంతో ఆ నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు.
వైసీపీ(YSRCP) ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు, చేర్పులు చేసింది.
జగనన్న మాటే మాది...ఆయన ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతామని మంత్రి మేరుగ నాగార్జున ( Minister Meruga Nagarjuna ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు మంత్రి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊరికే వచ్చాడా.. వైసీపీకి పని చేసి డబ్బులు తీసుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ కన్నా ఆరుగురు ప్రశాంత్ కిషోర్లు జగన్ గుండెల్లో ఉన్నారు’’ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
‘‘నాన్న... అనగానే నాకు వచ్చే మొదటి జ్ఞాపకం ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’. నా చిన్నప్పుడు మేం బేగంపేటలో ఉండేవాళ్లం......